స్థాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగఫలమే భారతదేశ సౌభాగ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి శాఖ ఆదర్శ్ హిందీ ప్రేమిమండలి గౌరవ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు బిపిన్ చంద్రపాల్ 91 వ వర్ధంతి, టంగుటూరి ప్రకాశం పంతులు 66వ వర్ధంతి, కాసు బ్రహ్మానంద రెడ్డి 29 వ వర్ధంతి సందర్బంగా భీమిలి ఆదర్శ్ హిందీ ప్రేమిమండలి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అధ్యక్షులు కృతజ్ఞతలు. ఎస్. ఆర్. కృష్ణారావు మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గంటా నూకరాజు హాజరయ్యారు. శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మీడియాతో గంటా నూకరాజు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను గౌరవించడం, వారి సేవలను గుర్తు చేసుకొని సమాజానికి తెలియజేయడంలో భారతదేశం ముందుంటుందని అన్నారు. ఆ విధంగా 1905 వ సంవత్సరంలో బెంగాల్ విభజనకు వ్యతిరకంగా సుదీర్ఘ పోరాటం చేసిన మహనీయుడు బిపిల్ చంద్రపాల్ అని అన్నారు. జాతీయోధ్యమ పత్రిక బందే మాతరంను స్థాపించి ఉద్యమానికి జీవం పోశారని అన్నారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకుగాను 6 మాసాలు జైలు శిక్షకు కూడా అనుభవించవలసి వచ్చిందని అన్నారు. అదేవిదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రతీ తెలుగువాడి గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు. రాష్ట్రానికి ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావడంలో విశిష్ట కృషి చేశారని అన్నారు. అదేవిదంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనంద రెడ్డి కూడా పేదల సంక్షేమం, సంస్కరణల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్వచ్ఛమైన పాలన అందించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చిన తరువాత రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి నాయకత్వం వహించారని అన్నారు. ఆవిధంగా ఎంతోమంది మహనీయులు ఈ దేశం కోసం రాష్ట్రం కోసం విశిష్ట కృషి చేశారని, వారి జీవిత చరిత్రలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని గంటా నూకరాజు కోరారు. ఈ కార్యక్రమంలో రాజగిరి రమణ, సత్తరవు చిన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.