విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. అప్పన్న చందనోత్సవం నేపధ్యంలో ఈ భారీ ఆదాయం లభించినట్లు ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆలయ ఇవో వి. త్రినాధరావు ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి స్వచ్ఛంద సంస్థల సహకారంతో లెక్కించారు. రెండు రోజులకు గాను రూ. 3, 05, 44, 183 కోట్లు ఆదాయం లభించింది. ఇక బంగారం, వెండి , విదేశీయ డాలర్లు పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించారు. 29 రోజులకు ఈ ఆదాయం లభించినట్లు ఆలయ ఇవో త్రినాధరావు శుక్రవారం పేర్కొన్నారు.