డెయిరీ ఫామ్‌తో పాల ద్వారానే కాకుండా దూడల ద్వారా అధిక లాభాలు వస్తాయి. ముఖ్యంగా నిర్వహణ కోసం మీరు తెచ్చుకునే గేదె ఆవు 10-15 రోజుల్లో ఈనే విధంగా ఉండాలి. అలాంటప్పుడే దూడ, పాలు.. రెండింటితో లాభాలు గడించవచ్చు. దూడను పెంచి, చూడి కట్టిన తర్వాత విక్రయిస్తే రెట్టింపు ధర పొందవచ్చు. అయితే మీరు విక్రయించే దూడ కూడా మంచి బ్రీడ్ అయి ఉండాలి. ఎక్కువ పాలు, అధిక వెన్న శాతం కలిగి ఉండాలి. ఈ విధంగా లాభాలు పొందవచ్చు.