నేలలో చౌడు శాతం తగ్గించే మెళకువలను పాటిస్తూ వరి పంట సాగు చేయవచ్చు. వరి సాగు చేయడానికి వీలు లేనప్పుడు చౌడును తట్టుకునే చెరకు, రాగి, జొన్న, మొక్కజొన్న, సజ్జ పైర్ల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆముదం, పత్తి పంటలు మద్యస్థంగా చౌడును తట్టుకుంటాయి. పెసర, మినుము, సోయాచికుడు, వేరుశనగ వంటి పైర్లు చౌడును తట్టుకోలేవు. కాబట్టి వీటిని సాగు చేయకపోవడం మంచిది.