ప్రజలు మద్యం, సారా, మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని ములకలచెరువు సెబ్ సీఐ మల్లిక అన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండెం మండలం శివపురం, కలిచర్ల గ్రామాలలో శనివారం రాత్రి సారా తయారు చేసేవారికి అవగాహన కల్పించారు. సారా తయారు చేసి పట్టుబడితే కఠినమైన కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కలిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలు వాడకంపై కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు సిఐ చెప్పారు.