వాల్తేరు డివిజన్ కెకె లైన్‌లో ఎస్ కోట-బొడ్డవర స్టాటోయిన్‌ల మధ్య ప్రీ-నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైల్లు రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈమేరకు రైలు నం. 18514 విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ 21న విశాఖపట్నం నుండి బయలుదేరుతుందని అలాగే 22న కిరండూల్ నుండి బయలుదేరే రైలు నెం 18513కిరండూల్-విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడిందన్నారు.
రైలు నం. 08551 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసెంజర్ స్పెషల్ 22న విశాఖపట్నం నుండి బయలుదేరుతుందని అలాగే రైలు నెం. 08552 కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ 23న కిరండూల్ నుండి బయలుదేరుతుందన్నారు. 22న విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నం. 18512 విశాఖపట్నం-కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడిందని ఆదివిధంగా రైలు నం. 18511 కోరాపుట్-విశాఖపట్నం ఇంటర్‌సీ ఎక్స్‌ప్రెస్ 23న కోరాపుట్ నుండి బయలుదేరుతుందన్నారు.
రైలు నం. 08546 విశాఖపట్నం-కోరాపుట్ ప్యాసింజర్ స్పెషల్ 22న విశాఖపట్నం నుండి బయలుదేరుతుందని 23న కోరాపుట్ నుండి బయలుదేరే రైలు నెం. 08545 కోరాపుట్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకం రద్దు చేయబడిందని ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని అభ్యర్థించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa