గుంటూరు పట్టణంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు గుంటూరు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28, జూన్ 2, 8, 16, 23, 30 తేదీల్లో కాచిగూడలో 18. 45 గంటలకు బయలుదేరే రైలు నెం (07435) నడికుడి 22. 48, సత్తెనపల్లి 23. 48, గుంటూరు 00. 45, తెనాలి 01. 40. బాపట్ల 02: 30, నాగర్ కోయిల్ మరుసటి రోజు 22. 30 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో, ఈ రైలు నెం (07436) ఈనెల 28, జూన్ 4, 11, 18, 25, జులై 2న నాగర్ కోయిల్లో 00. 30 గంటలకు బయలుదేరి బాపట్ల 21. 00, తెనాలి 22. 00, గుంటూరు 22. 43. సత్తెనపల్లి 23. 30, నడికుడి 01. 15, కాచిగూడ మరుసటిరోజు 06. 30 గంటలకు వెళ్తుంది.