ఏపీ జే. ఏ. సి. అమరావతి మూడవ దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగుల వేదనను చెబుదాం అనే నినాదంతో ఆదివారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్ ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా జే ఏ సీ చైర్మన్ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి నెల 1 వ తారీకున ఉద్యోగులకు జీతాలు , పెన్షనర్ల కు పెన్షన్ ఇవ్వాలన్నారు. 1. 7. 2018, 1. 1. 2019, 1. 7. 2019, 1. 7. 2021 పెండింగ్ లో ఉన్న 4 డీ ఏ అరియర్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. 11 వ పి అర్ సి కమీషన్ రికమెండ్ చేసిన పే స్కేల్స్ వెంటనే విడుదల చేయాలి. పి అర్ సి అరియర్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న 2 డీ ఏ లు వెంటనే విడుదల చేయాలి. ముఖ్యమంత్రి పాదయాత్ర లో ప్రకటించినట్లుగా సి పి ఎస్ ను వెంటనే రద్దు చేసి ఓ పి ఏస్ లోకి మార్చాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలి.
వి అర్ ఏ లకు సంబంధించిన ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దీనిపై ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పందిస్తూ ఉద్యోగుల ప్రధాన సమస్యలు వాస్తవమని వాటిని ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళతానని తప్పక నా వంతు సహకారం అందిస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఏపీ జే ఏ సి అమరావతి, బాపట్ల జిల్లా చైర్మన్ సి. హెచ్. సురేష్ బాబు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు టి. భాస్కరరావు, చీరాల డివిజన్ కోశాధికారి, యస్. బలవెంకట విష్ణు ప్రసాద్, సభ్యులు బి. అశోక్ కుమార్ లు పాల్గొన్నారు.