భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో మే 21 ఆదివారం మధ్యాహ్నం గుంటూరు ఆటోనగర్లో ప్రారంభోత్సవం జరిగిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆదివారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బి ఆర్ ఎస్ కార్యాలయం ఫ్లెక్సీలను చించేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బి ఆర్ ఎస్ నాయకులు కాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసు వారు ఈ విషయంపై సమగ్ర దర్యాప్తుకు ఉపక్రమించారు.