శావల్యపురం మండలంలో ఇప్పటి వరకు రైతుల నుంచి రెండు వేల క్వింటాళ్లు మొక్కజొన్న కొనుగోలు చేశామని శావల్యాపురం సొసైటీ సీఈవో జాలాది నాగప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ-క్రాప్ తో పాటు రైతు భరోసా కేంద్రాల్లో పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకున్న ప్రతి రైతు పంటను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులంతా కొనుగోలును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.