నర్సీపట్నం శాఖ గ్రంధాలయంలో ఆదివారం పిల్లలకు యోగా తరగతులు నిర్వహించారు. యోగ టీచర్ రాజలక్ష్మి యోగా ప్రాముఖ్యతను వివరించారు. గ్రంథాలయ అధికారిని పి. దమయంతి పిల్లల చేత కథలు చదివించారు. విశ్రాంతి ఉపాధ్యాయులు ప్రభాకర్ రిక్రియేషన్ గేమ్ ఆడించారు. ఈ ఆటలో ఏకాగ్రత ఎంత అవసరమో చేసి చూపించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ మాట్లాడుతూ పిల్లలకు అనేక అంశాలలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు