తెలుగు కథారచయిత కేతు విశ్వనాథ రెడ్డి మృతిపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సామాజిక సంస్కరణల ఆవశ్యకతను చెబుతూ ఆయన రాసిన కథలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయన్నారు. విశ్వనాథ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 2021లో విశ్వనాథ రెడ్డిని వైఎస్ఆర్ ఆల్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించామని సీఎం పేర్కొన్నారు.