నేడు ఉదయం మయన్మార్ లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమి ఉపరితలం నుండి 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు NCS గుర్తించింది. భూకపం ధాటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు తెలిపారు.