ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి గిద్దలూరు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతి చెందిన వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa