ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఇవాళ, రేపు, బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, ఒకటి రెండు చోట్ల గంటకు 40-50కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.