రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోట్లు చెల్లవని చెప్పలేదని తెలిపింది. అప్పటి పరిస్థితిని బట్టి ఏం చేయాలో ఆ తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. రూ.50 వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ నెంబర్ ఇవ్వాల్సిందేనని వెల్లడించింది.రూ.1000 నోటును పున:ప్రవేశ పెట్టే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. కాగా, నేటి నుంచి (మంగళవారం) నుంచి రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది.