మామిడికుదురు టీడీపీ మండల అద్యక్షులు మొల్లేటి శ్రీనివాస్ అధ్యక్షతన మామిడికుదురులో మంగళవారం జరిగిన మండల తెలుగుదేశం పార్టీ సమావేశంలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ 27, 28 తేదీలలో రాజమండ్రి సమీపంలో కడియపులంక లంక వద్ద జరగబోయే మహానాడు కార్యక్రమంలో రాజోలు, గన్నవరం నియోజకవర్గాలనుండి టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చెయ్యాలని అన్నారు. ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వ రాక కోసం ఎదురు చేస్తుండటంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంచి ఉత్సాహంగా ఉన్నారని ఈ మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుందని అన్నారు. ప్రతీ గ్రామం నుండి ఉత్సాహంగా ముందుకు వచ్చే కార్యకర్తలను గుర్తించి వారికి రవాణా సౌకార్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ప్రతి గ్రామంలోనూ గ్రామశేఖ సమావేశాలను నిర్వహించి ఏయే గ్రామాల నుండి ఎంతమంది వచ్చేది ముందుగా తెలియజెయ్యాలని గ్రామశేఖలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సూద బాబ్జి, ఈలి శ్రీనివాస్, వర్ధినీడి బాబ్జి, బోనం బాబు, కంచి విశ్వనాధం, కొమ్ముల నందు బాబు, చుట్టుగుల్ల కిషోర్, ఇంటి గణపతి, పెచ్చెట్టి భాస్కరావు, తదితరులు పాల్గొన్నారు.