ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల కృష్ణా రావు కుటుంబసమేతంగా దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ అంద జేశారు. మరియు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ప్రోటోకాల్ జడ్జి కె. రాణి, ఎస్ సి ఎస్ టి జడ్జి ఎం ఎస్ ఫణి కుమార్, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జడ్జి పి. భాస్కర్ రావు, ఆలయ సూపరింటెండెంట్ కె. వెంకటేశ్వర రావు, ఆలయ అర్చకులు పాల్గున్నా రని ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు.