గాజువాకపెదగంట్యాడ హౌసింగ్ బోర్డ్ కాలనీ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో యువతను ప్రోత్సహించడం కొరకు సమ్మర్ క్యాంప్ 76 వ వార్డు వైసిపి ఇన్చార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలోమంగళవారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక జోనల్ కమిషనర్ పి. సింహాచలం విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈరోజు నుంచి జూన్ 5వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని అన్ని రకాల స్పోర్ట్స్ ని ప్రోత్సహించడం కొరకు స్కూల్స్, కాలేజీలు విద్యార్థులు ఖాళీగా ఉండకుండా వారి ప్రతిభను బట్టి స్పోర్ట్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు. వారికి పౌష్టిక ఆహారం అందిస్తారని అన్నారు. దొడ్డి రమణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం చేయకురాలని గౌరవ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి సర్వతో స్పోర్ట్స్ మెన్ అందరికీ పౌష్టికాహారం అందించడం జరుగుతుందని. ప్రతి ఒక్క విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి ప్రతిభను కనబరుచుకొని రాబోయే రోజుల్లో ఏ ఉద్యోగాలు కైనా స్పోర్ట్స్ చాలా అవసరాన్ని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ కమిటీ సభ్యులు టి. వై. దాస్ ప్రెసిడెంట్, ఎం. శ్రీకాంత్ సెక్రటరీ, డి. సురేష్, యు. దుర్గారావు, అర్. భాస్కరరావు, జె. అర్. రమణ, వి. రమణ, పత్రి దేవి, అర్. రేవతి, డి. లత, జి. భూదేవి, కె. బాలాజీ, గోందేసి రాము, సతీష్ మరియు క్రీడాకారులు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.