ద్రావిడ విశ్వవిద్యాలయంలో 4 నెలలు పూర్తవుతున్న జీతాలు అందించడం లేదని మంగళవారం సమ్మెలో భాగంగా కాలీ ప్లేట్లను చేతపట్టి నిరసనను తెలియజేశారు. గత 26 రోజులుగా జీతాల కోసం సమ్మె చేస్తున్న వర్సిటీ అధికారుల్లో ఎలాంటి చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు తమ పోరాటం ఆగదని, తమ ఆకలి కేకలను ప్రభుత్వం, వర్సిటీ అధికారులు స్పందించేంతవరకు తమ నిరసనను తెలియజేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తమకు పెంచిన జీతాలు తోపాటు 12 నెలల అరియర్స్, ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.