తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద సీనియర్ న్యాయవాది, జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుదు జడా శ్రావణ్ కుమార్ ను పోలీసులు దీక్షా శిబిరం వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. తుళ్లూరు శిబిరంలో 48 గంటల నిరాహార దీక్ష చేసేందుకు శ్రావణ్ కుమార్ దీక్షా శిబిరం వద్దకు చేరుకోగానే పోలీసులు వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలిపే స్వేచ్ఛ లేదా అని జడ శ్రావణ్ ప్రశ్నించారు.