మండల కేంద్రమైన కైకలూరు లోగలఏలూరు రోడ్డులోని వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలని సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, కాంట్రాక్టర్ను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే డీఎన్నార్ జగనన్న గ్రీన్ విలేజ్లో పర్యటించారు, అక్కడ జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించామన్నారు. ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు.