తిరుమలలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగించాలి, ఎలాంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించాలో అధ్యయనం చేస్తామని చెప్పారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్ల వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు.