తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయం అంజి రెడ్డి భవన్ లో తాడేపల్లి మండల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిథులుగా నిమ్మకాయల రాజనారాయణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, గంజి చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు వేమారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అసలు తమకు పోటీనే కాదని రానున్న ఎన్నికల్లో మంగళగిరి లో 50 వేల మెజారిటీతో గెలుపొందుతామని అన్నారు. ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ చంద్రబాబు పేదల స్థలాలను స్మశానంతో పోల్చడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు రాజనారాయణ, మాజీ ఎంపీపీ పాతూరి లలితకుమారి, మండల వైసిపి అధ్యక్షులు పాటిబండ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.