రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో వేరుశనగ పంట సాగుకు సబ్సిడీతో అందిస్తున్న విత్తన కాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఎస్ఆర్ పురం మండలంలో శుక్రవారం ఓ కార్యక్రమం అనంతరం రైతులకు సబ్సిడీ విత్తన కాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్. ఆర్. పురం మండలంలోని 810 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 30 కేజీల సంచి సబ్సిడీ పోను రూ. 1, 674 కే ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి సర్పంచ్ హరిత కుప్పయ్య , మండల కన్వీనర్ మనీ, డిసిసిబి బ్యాంకు డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.