గుంటూరు , పల్నాడు జిల్లాలో గురువారం మధ్యాహ్న భారీగా ఈదురు గాలులు సంభవించి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలోగురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు వర్షం రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఈదురు గాలులకు రెండు జిల్లాల పరిధిలో విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచింది.