రాజధాని అమరావతిలో ప్రభుత్వం సెంటు భూమి పంచడంపై టీడీపీ నేత బోండా ఉమ ధ్వజమెత్తారు. అమరావతిపై కక్షతోనే సీఎం సెంటు పట్టాల నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. సెంటు పట్టాలు అనేవి ఒక బోగస్‌గా కొట్టిపారేశారు. సుప్రీం కోర్టు సెంటు పట్టాకు చట్టబద్ధత లేదని చెప్పినా జగన్ పేదలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.