కొత్త పార్లమెంట్ భవనం రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. కొత్త భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని పిల్ దాఖలైంది. దానిని సుప్రీం కోర్టు కొట్టేసింది. ప్రధాని నరేంద్ర మోడీ కొత్త భవనాన్ని ప్రారంభించడం పై విపక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం రాష్ట్రపతిని అవమానించడమేనని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.