వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఇవాళ అవినాష్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... రేపు సీబీఐ వాదనలు విననుంది. ఈ నేపథ్యంలో అవినాష్ ముందస్తు బెయిల్ పై సస్పెన్స్ రేపటితో తెరపడే అవకాశం ఉంది.ప్రస్తుతం అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. తల్లి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో అవినాష్ కూడా ఆస్పత్రిలోనే ఉన్నాడు.