రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయి. సాయంత్రం 6 గంటలైనా ఎండ తీవ్రత తగ్గడంలేదు. మండుటెండలకు తోడు వడగాడ్పులు దడపుట్టిస్తున్నాయి. శుక్రవారం అత్యధికంగా నిండ్రలో 43. 1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాలవారీగా శ్రీరంగరాజపురంలో 42. 3, చిత్తూరులో 42. 2, తవ ణంపల్లెలో 42. 1, విజయపురంలో 42. 1, గుడిపాలలో 41. 8, నగరిలో 40. 9, పెద్దపంజాణిలో 40. 3, వెదురుకుప్పంలో 40. 2, కార్వేటినగ రంలో 40. 1, బంగారుపాళ్యంలో 40, గంగవరంలో 39. 9, ఐరాలలో 39. 8, పాలసముద్రంలో 39. 6, యాదమరిలో 39. 2, పుంగనూరులో 38. 9, పూతలపట్టులో 38. 6, పలమనేరులో 38. 4, పెనుమూరులో 38. 4, గంగాధరనెల్లూరులో 38. 4, చౌడేపల్లెలో 38. 4, వి. కోటలో 37. 5, కుప్పంలో 37. 1, సదుంలో 37. 1, సోమలలో 36. 8, రొంపిచెర్లలో 36. 1, గుడుపల్లెలో 36, పులిచెర్లలో 35. 9, బైరెడ్డిపల్లెలో 35. 7, శాంతిపురంలో 35, రామకుప్పంలో 34. 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.