కేరళలోని కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్(58) అనే హోటల్ యజమానిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేశారు. మే 18న ఎరంజిపాలెంలోని ఓ హోటలులో బి3, బి4 గదులను ఆయన బుక్ చేసుకోగా, అదే హోటలులో శిబిల్ (22), ఫర్హానా (18) పై అంతస్తు గదిలో దిగారు. మే 19న నిందితులు ఓ ట్రాలీబ్యాగుతో వెళ్లిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. సిద్ధిఖ్ అదృశ్యమవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.