కారణం లేకుండా భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. తన విడాకుల అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు 1979లో వివాహమవ్వగా, తన భార్య తనతో కలిసి జీవించేందుకు నిరాకరించిందని, 1994లో పెద్దల తీర్మానంతో విడిపోయామని, చట్టపరంగా విడాకులు ఇవ్వాలని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa