మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ భాస్కరరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉండటం, ఈసీజీలోనూ వ్యత్యాసాలు కనిపించాయి. జైలు వైద్యుల సిఫార్సుతో అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆయనను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం నిమ్స్‌కి తరలించే అవకాశం ఉందని సమాచారం.