వారం రోజుల క్రితం వీచిన ఈదురుగాలుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రైల్వే కోడూరు నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఓబులవారిపల్లి మండలం కాకర్ల వారి పల్లి కి చెందిన గిరినాయుడు బొప్పాయి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదురు గాలుల వల్ల నష్టపోయిన బొప్పాయి, అరటి మొదలగు ఉద్యానవన పంటలను పరిశీలించి, అంచనాలను తయారుచేసి ఉన్నత అధికారులకు పంపించాలని రైల్వే కోడూరు ఉద్యానవన శాఖ అధికారులను కోరామని ఆయన తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ కొరముట్ల హామీ ఇచ్చారు.