ఆస్ట్రేలియా యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకు షాకిచ్చాయి. ఉత్తరాఖండ్, యూపీ, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూకశ్మీర్లకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై విధించిన తాత్కాలిక నిషేధంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులు స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివర్సిటీ, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఏజెంట్లకు తాజాగా సూచనలు జారీ చేశాయి. ఆ విద్యార్థులు చేస్తున్న దరఖాస్తుల్లో చాలా వరకు మోసపూరితంగా ఉన్నాయని అక్కడి అధికారులు తెలిపారు.