గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామం పరిధిలోని జిబిసి రోడ్డులో శనివారం గుంటూరు నుంచి ఊక లోడుతో వస్తున్న లారీ మునిపల్లె చెరువు మలుపు దగ్గరకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం లో లారీ డ్రైవర్ కు ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉదయం సమయం కావటంతో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవటం వలన పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa