గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వార్డులోసంజీవయ్య కాలనీ -1ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు 47వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరితో కలిసి శనివారం పర్యటించారు. గడప గడపకి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లా ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 47 వార్డు నాయకులు వసంతల అప్పారావు, సుకుమార్, గార కృప, రాఘవులు, గురువోజీ, డిల్లీ ఈశ్వరరావు, అనిత, సీనియర్ నాయకులు షేక్ బాబ్జి, కె. చిన్న, మరియు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa