గృహ నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని గజపతినగరం మండల ప్రత్యేక అధికారి రమేష్ అన్నారు. శనివారం హౌసింగ్ డే పురస్కరించుకొని గజపతినగరం మండలంలోని పాతబగ్గాం గ్రామంలో జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన బిల్లులు చెల్లిస్తున్న కారణంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగరాదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పప్పు సుదర్శనం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa