ఏపీలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.
శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (97) :- అల్లూరి2, అనకాపల్లి 1, బాపట్ల 7, తూర్పుగోదావరి 7, ఏలూరు 4, గుంటూరు 17, కాకినాడ 9, కోనసీమ 10, కృష్ణా 15, ఎన్టీఆర్ 8, పల్నాడు 9, మన్యం4, పశ్చిమగోదావరి 3, కడప జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది అంటున్నారు విపత్తుల నిర్వహణ సంస్థ.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఎక్కువుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపాయి. అల్లూరి , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం · శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి· విశాఖపట్నం, కర్నూలు,నంద్యాల, అనంతపురం, సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు వర్షం, ఇటు ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) చెబుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ప్రకారం జూన్ నుంచి సెప్టెంబరు వరకు గల 4 నెలల సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు. రుతుపవనాల సీజన్‌లో మొదటి నెల జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది అంటున్నారు. మరోవపు నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఎల్‌నినో ప్రభావం పశ్చిమ భారతంపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు.