పార్లమెంటు కొత్త భవనాన్ని మే 28 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో 8 శతాబ్దంలోని చోళుల కాలం నాటి రాజదండాన్ని పార్లమెంట్ భవనంలోని స్పీకర్ కుర్చీకి దగ్గరలో ఉంచనున్నట్లు ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు ప్రాంతీయ పార్టీలు కలిపి మొత్తం 25 పార్టీలు హాజరవుతామని ఇప్పటికే వెల్లడించాయి. కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు.. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశాయి.