మధ్యప్రదేశ్‌లోని కునో పార్క్‌లో చీతాల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది సభ్యులతో ఉన్నతస్థాయి చీతా ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. గ్లోబల్ టైగర్ ఫోరమ్ సెక్రటరీ జనరల్ రాజేశ్ గోపాల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దేశంలో చీతాల ప్రాజెక్టు సమీక్ష, పురోగతి, పర్యవేక్షణ కోసం ఈ కమిటీ సలహాలు ఇవ్వనుంది.