చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి శనివారం శ్రీదేవి, భూదేవి సమేతంగా బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో ఊరే గుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి శనివారం సాయంత్రం స్వామి వారికి తిరుచ్చి వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ నర్రా ముని చెంగల్ రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు ఏవిఎల్ యన్ శ్రీనివాసచార్యులు, సంతాన కృష్ణన్ అధ్యాపక, విష్ణు స్వామీ, డాక్టర్ లక్ష్మి, రాజేష్ స్వామీ పరిచారిక, రమణయ్య పాల్గొన్నారు.