రాజమండ్రిలో జరగబోయే 33వ మహానాడులో శనివారం చోడవరం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు, నియోజకవర్గం ఇన్చార్జి బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గునురు మల్లు నాయుడు పాల్గొన్నారు. 41 సంవత్సరాల పార్టీ చరిత్రలో 32 సార్లు మహానాడు నిర్వహించారు. ఎండా వేడి, దూర ప్రాంతం సైతం లెక్కచేయకుండా రాజమహేంద్రవరం మహానాడుకు కార్యకర్తలు చేరుకున్నారని నాయకులు అంటున్నారు.