కార్వేటి నగరంలో శనివారం రాత్రి దాదాపు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షం నేపథ్యంలో మండలంలో సుమారు 6 గంటలపాటు విద్యుత్ సరఫరా అధికారులు నిలిపివేశారు దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, స్థానిక ఏ ఈ ఏడి లకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదు సరైన సమాధానం చెప్పలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా కరెంటు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.