15 వేల మంది కార్యకర్తలు నియోజకవర్గం నుంచి బయలు దేరుతున్నారని, వందలాది వాహనాల్లో పసుపు దండు ఇప్పటికే రాజమండ్రి చేరుకుందని అమలాపురం ఇంచార్జి అయితా బత్తుల ఆనంద రావు తెలిపారు. గడియార స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులు అర్పించారు. నాయకులు అల్లాడ స్వామి నాయుడు, చిక్కాల గణేష్, నల్లా స్వామి పెచ్చేట్టి విజయలక్ష్మి, కర్రి దత్తుడు, తిక్కిరెడ్డి నేతాజీ, బత్తుల ప్రసాద్ తదితరులు వున్నారు.