కార్వేటినగరం మండలంలో శనివారం , ఆదివారం రాత్రి వచ్చిన గాలివానకు మామిడి పంట బాగా దెబ్బతింది. మామిడికాయలు తోటల్లో రాలిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. స్కంధ పుష్కరిణి వద్ద భక్తులు తలనీలాలు సమర్పించే రేకుల షెడ్డు సగభాగం ఎగిరిపోయింది. మండల ఆఫీసుకు ముందు రైతు పొలంలో కొబ్బరి చెట్లు నేలకూలాయి. విపరీత మైన గాలులకు నాలుగు గంటల పాటు కరెంటు సరఫరా ఆగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు.