కడప జిల్లా సిద్ధవటం మండలం నేకనాపురం గ్రామంలో అధిక ఈదురు గాలులు, వర్షం రావడంతో పలు రహదారిలో వేప చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్సీ కాలనీ చెందిన భాగ్యమ్మ అనే నిరుపేద కుటుంబం పై వేప చెట్టు పడి పూర్తిగా గృహం దెబ్బతింది. రోధిస్తున్న భాగ్యమ్మ ఆ ప్రాంతానికి గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన గ్రామస్తులు చేరుకొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.మండల అధికారులు మా గ్రామం సందర్శించి దెబ్బతిన్న గృహాలకు నష్ట పరిహారం చెల్లించాలని గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన తెలియజేశారు. భాగ్యమ్మ మీడియాతో మాట్లాడుతూ నాకు ముగ్గురు పిల్లలు కలరని పనికి పోతే తప్ప మా కుటుంబం జరగని పరిస్థితని మొరపెట్టుకుంది.