ఢిల్లీ జంతర్‌మంతర్‌లో రెజ్లర్లు, పోలీసులకు జరిగిన ఘర్షణపై రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందించారు. ‘‘మేము శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్నాం. కానీ పోలీసులే అడ్డుకున్నారు. మమ్మల్ని నెట్టడం ప్రారంభించారు. అనంతరం లాక్కెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. మేము అల్లర్లు చేయలేదు, ప్రజా ఆస్తులను డ్యామేజ్ చేయలేదు’’అని ఆమె చెప్పుకొచ్చారు.