ప్రపంచంలోనే అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న దేశం అమెరికా. ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ ఉంది. భారత్ లో 65 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 37 శాతం మంది రైతులు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. దాదాపు 60 శాతం భూమిలో వర్షాధారణతోనే పంటలు కొనసాగిస్తున్నారు. అమెరికాలో భూమి ఎక్కువున్నా సాగుచేసే వారు తక్కువ.