స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన డి. ఆర్. ఓ ఎన్. రాజశేఖర్, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డిలతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం. 253 అర్జీలు రాగా, ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు రెవెన్యూశాఖ కు సంబంధించి 181, హౌసింగ్ శాఖ 7, నగర పాలక సంస్థ 1, నేషనల్ హైవే 8, సోషల్ వెల్ఫేర్ 1, పంచాయత్ రాజ్ 1, పోలీసు శాఖ 4, వైద్య మరియు ఆరోగ్య శాఖ 5, పింఛన్లు, రేషన్ కార్డ్స్ 45, అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు డి. ఆర్. ఓకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా డి. ఆర్. ఓను మరియు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.